తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి బతికించిన వైద్యులు - అలీగఢ్ యూనివర్సిటీ జవహర్​లాల్ నెహ్రు ఆస్పత్రి

పుట్టుకతోనే గుండెకు చిల్లుపడ్డ ఓ చిన్నారికి విజయవంతంగా ఓ అరుదైన సర్జరీ చేశారు వైద్యులు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించారు. దీంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. తమ బిడ్డకు పునర్జన్మనిచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

AMU: Extraordinary surgery gave the baby new life
పుట్టుకతోనే గుండెకు చిల్లు.. సర్జరీతో చిన్నారికి పునర్జన్మనిచ్చిన వైద్యులు

By

Published : Nov 20, 2021, 7:03 PM IST

ఓ చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని జవహర్​లాన్​ నెహ్రూ మెడికల్ కాలేజ్ వైద్యులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రీయ బాల్ స్వస్థ్​ కారియా కరం పథకం ద్వారా ఉచితంగా సర్జరీ చేసి పసికందు ప్రాణాలు నిలిపారు. దీంతో తల్లిదండ్రులు పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

పుట్టుకతోనే గుండెకు చిల్లు.. సర్జరీతో చిన్నారికి పునర్జన్మనిచ్చిన వైద్యులు

ఉత్తర్​ప్రదేశ్​ హథ్రాస్ జిల్లాకు చెందిన వాకిల్ ముహమ్మద్​ దంపతులు కొద్దిరోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చారు. కానీ అతడికి పుట్టుకతోనే గుండెలో రంద్రం ఏర్పడింది. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ట్రాన్స్​లోకేషన్ ఆఫ్ గ్రేటర్ ఆర్టెరీస్(టీజీఏ) అంటారు. అంటే గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు రివర్స్ అవుతాయి.

పుట్టుకతోనే గుండెకు చిల్లు.. సర్జరీతో చిన్నారికి పునర్జన్మనిచ్చిన వైద్యులు

తమ బిడ్డ ముస్తాఖీమ్​ ప్రాణాలు నిలుపుకునేందుకు తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించారు. కానీ చికిత్సకు అయ్యే ఖర్చు తాము భరించలేమని తెలిసి బాధపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయత్నించగా.. చాలా మంది వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు. ఈ సమయంలోనే పసిబాలుడు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడ్డాడు. అతని రంగు కూడా క్రమంగా నీలంలోకి మారింది. ఈ క్రమంలో వారికి అలీగఢ్​ యూనివర్సిటీలో జవహర్​లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో కేంద్ర పథకం ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నారని తెలిసింది. వెంటనే వారు తమ బిడ్డను ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

బాలుడి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. ప్రొఫెసర్​ ముహమ్మద్ అజాం హుస్సేన్​ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ పీడియాట్రిక్ సర్జరీ చేసింది. రివర్స్​ అయిన ధమనులను సరిచేసి చిన్నారి గుండె రంద్రాన్ని పూడ్చినట్లు వైద్యులు తెలిపారు.

పుట్టుకతోనే గుండెకు చిల్లు.. సర్జరీతో చిన్నారికి పునర్జన్మనిచ్చిన వైద్యులు

అలీగఢ్​ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్​ ప్రొ.తరీఖ్​ మన్సూర్​.. శస్త్ర చికిత్స దిగ్విజయంగా పూర్తి చేసిన తమ వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. గత కొన్నేళ్లలో జవహర్​లా​ల్​ నెహ్రూ వైద్య కళాశాలలో 500మందికి గుండె సంబంధిత శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసినట్లు వెల్లడించారు.

వైద్యులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు ముస్తాఖీమ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కుమారుడికి పునర్జన్మ ప్రసాదించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నాడని, కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.

ఇదీ చదవండి:మహంత్​ అనుమానాస్పద మృతిపై సీబీఐ ఛార్జిషీటు

ABOUT THE AUTHOR

...view details