యువత 'టోర్న్ జీన్స్' వేసుకోవద్దంటూ ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తీరథ్ ముందు తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలంటూ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మనమరాలు నవ్య నవేలి నందా అన్నారు. సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇన్స్టాలో ఓ పోస్టు చేశారు.
"యువతు డ్రెస్సింగ్ విధానాన్ని మార్చడానికి ముందు మీరు(తీరథ్) ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి? నేను తప్పకుండా టోర్న్ జోన్స్ వేసుకుంటా. అది గర్వంగా భావిస్తా."