Amit Shah Vehicle Accident :కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అమిత్ షా ప్రచార రథం రోడ్డుపై వెళ్తుండగా విద్యుత్ తీగను తాకింది. వెంటనే నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో జరిగింది. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు పరబత్సర్ నుంచి బిదియాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దుకాణాల వీధిలో నుంచి వెళ్తుండగా.. ప్రచార రథం పైభాగం కరెంట్ తీగలను తాకింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం మరో వాహనంలో వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించారు అమిత్ షా. కానీ ఎన్నికల ర్యాలీని రద్దు చేసుకున్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
అమిత్ షాకు తప్పిన పెను ప్రమాదం- ప్రచార రథానికి కరెంట్ షాక్, ర్యాలీ రద్దు చేసుకుని వెనక్కి - rajasthan assembly election 2023
Amit Shah Vehicle Accident : కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అమిత్ షా ప్రచార రథం రోడ్డుపై వెళ్తుండగా విద్యుత్ తీగను తాకింది. వెంటనే నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అమిత్ షాను వేరే కారులో తరలించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో జరిగింది. అమిత్ షా ప్రచారానికి వెళ్తుండగా జరిగింది. ఫలితంగా ఎన్నికల ర్యాలీని రద్దు చేసుకున్నారు.
Published : Nov 7, 2023, 9:21 PM IST
|Updated : Nov 7, 2023, 11:03 PM IST
గహ్లోత్‌పై మండిపడ్డ అమిత్ షా
అంతకుముందు ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన అమిత్ షా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల్ని ఓట్లు అడిగే ముందు అసలు ఆ 'రెడ్ డైరీ'లో ఏం రాసుకున్నారో వెల్లడించాలన్నారు. ఈ 'రెడ్ డైరీ' అంశంపై మంత్రిపై చర్యలు తీసుకోవడం కాదు.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. "కాంగ్రెస్ కుటుంబ పార్టీ. సోనియా గాంధీ తన కుమారుడిని ప్రధాని చేయాలనుకుంటుంటే.. ఇక్కడ సీఎం గహ్లోత్ తన కుమారుడిని ఆవిష్కరించాలని అనుకుంటున్నారు. అయినా కుదరడం లేదు. రాజస్థాన్ ప్రజలు కుటుంబ రాజకీయాలను ఒప్పుకోరు. కాంగ్రెస్ నేతలు తమ వారసులను ప్రయోగిస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చంద్రయాన్‌ను ప్రయోగించారు. జాబిల్లిపైకి జాతీయ జెండాను పంపించారు. గహ్లోత్ సర్కార్ ఐదేళ్లలో అవినీతిలో అన్ని పరిమితులు దాటేసింది. దేశంలో ఎక్కడా జరగనన్ని పరీక్ష పేపర్ లీకేజీలో రాజస్థాన్‌లోనే జరిగాయి. గత నాలుగేళ్లలో 14 వేర్వేరు పరీక్ష పేపర్లు లీక్ చేయడం ద్వారా లక్షలాది మంది యువతకు ద్రోహం చేశారు. గహ్లోత్ తన ఇమేజ్‌ని మరింతగా పెంచుకొనేందుకు రెండేళ్లలోనే రూ.2వేల కోట్లు ఖర్చు చేశారు" అని అమిత్ షా విమర్శలు గుప్పించారు.