Amit Shah Speech at Nalgonda Public Meeting : బీజేపీకి మీరు వేసే ఓటు తెలంగాణ.. దేశ భవిష్యత్తును మారుస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. అవినీతితో నిండిన కారును మోదీ సంక్షేమ గ్యారేజీలో పడేసే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. కమీషన్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు. నల్గొండలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు.
Amit Shah Election Campaign : స్మార్ట్ సిటీ కింద నల్గొండ అభివృద్ధికి మోదీ సర్కార్ రూ.400 కోట్లు ఇచ్చిందని అమిత్ షా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కేసీఆర్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే అని విమర్శించారు. తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే ఆ పార్టీల లక్ష్యమని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ గెలిస్తే.. సీఎం అయ్యేది తమ వారసులు కాదని.. బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని పునరుద్ఘాటించారు.
మిషన్ భగీరథ పేరుతో బీఆర్ఎస్ నేతలు రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అమిత్ షా ఆరోపించారు. మియాపూర్ భూ కుంభకోణంలో వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల కమీషన్లు తీసుకున్నారని.. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే.. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని స్పష్టం చేశారు.
బీజేపీకి మీరు వేసే ఓటు తెలంగాణ.. దేశ భవిష్యత్‌ను మారుస్తుంది. అవినీతితో నిండిన కారును మోదీ సంక్షేమ గ్యారేజీలో పడేసే సమయం వచ్చింది. కమీషన్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన సమయం ఇదే. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా కుటుంబ పార్టీలే. తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే కుటుంబ పార్టీల లక్ష్యం. భారతీయ జనతా పార్టీ గెలిస్తే.. సీఎం అయ్యేది మా వారసులు కాదు. బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. - అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
బీజేపీకి మీరు వేసే ఓటు - తెలంగాణ, దేశ భవిష్యత్తును మారుస్తుంది : అమిత్ షా