తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే - తెలంగాణ ప్రజలకు అయోధ్యలో ఉచితంగా రామదర్శనం : అమిత్​ షా - కేంద్రమంత్రి అమిత్​ షా తెలంగాణ టూర్

Amit Shah Speech at Gadwal Public Meeting : ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేంద్రమంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ క్రమంలోనే అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ రికార్డు సృష్టించారన్న ఆయన.. బీఆర్​ఎస్​కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు.

bjp sakala janula vijaya sankalpa sabha
Amit Shah Speech at Gadwal Public Meeting

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 2:14 PM IST

Updated : Nov 18, 2023, 4:35 PM IST

Amit Shah Speech at Gadwal Public Meeting :శక్తి పీఠం అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారి స్థలానికి రావడం తన అదృష్టమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించిందని తెలిపారు. అదే సమయంలో ఆలయ ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ ఇస్తానన్న రూ. 100 కోట్లు ఇవ్వకపోగా.. మోదీ ఇచ్చిన డబ్బును కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Amit Shah Speech At Suryapet Jana Garjana Sabha : 'వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం'

Amit Shah Comments On BRS :ఈ సందర్భంగా ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని అమిత్​ షా పేర్కొన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే అభివృద్ధి సాధ్యమన్న ఆయన.. బీఆర్​ఎస్​కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు. ఈ క్రమంలోనే అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ రికార్డు సృష్టించారని దుయ్యబట్టారు. గుర్రంగడ్డ వంతెనను ఇప్పటికీ పూర్తి చేయలేదని.. గద్వాలలో 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే వర్గం కోసం పనిచేస్తున్నాయి : బండి సంజయ్

Amit Shah Comment Telangana Tour Today :పాలమూరు-రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టును కేసీఆర్ సర్కార్​ ఇంకా పూర్తి చేయలేదని అమిత్​ షా ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే వాల్మీకి, బోయలకు కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణకు బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని మోదీ హామీ ఇచ్చారన్న ఆయన.. బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి తొలి బీసీని సీఎంగా చేసి తీరుతామని వెల్లడించారు. ఈ క్రమంలోనే 52 శాతం జనాభా, 132 కులాలు ఉన్న బీసీ రాష్ట్రానికి ఆ కులానికి చెందిన వ్యక్తే సీఎం ఉండాలని వ్యాఖ్యానించారు. బీసీలకు టికెట్లు ఇవ్వడంలో కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందని అమిత్​ షా విమర్శించారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ కంటే బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇచ్చింది తమ పార్టీనే అని తెలిపారు. మోదీ మంత్రివర్గంలో 25 మంది బీసీలకు అవకాశం కల్పించారని.. దేశానికి బీసీని ప్రధానిని చేసింది కూడా భారతీయ జనతా పార్టీ అని స్పష్టం చేశారు.

23 తర్వాత బీజేపీ అగ్ర నేతల విస్తృత ప్రచారం

"వైద్య విద్యలో బీసీ విద్యార్థులకు మోదీ ప్రభుత్వం 25 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​లు బీసీ విరోధ పార్టీలు. తెలంగాణ యువతను కేసీఆర్‌ మోసం చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీతో యువత జీవితాలతో ఆడుకున్నారు. ప్రవళిక లాంటి యువత ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీకి అధికారమిస్తే ఐదేళ్లలో యువతకు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది సర్దార్‌ వల్లభ్​భాయ్‌ పటేల్‌. ఓవైసీకి లొంగిపోయి సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టలేదు. అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను బీఆర్​ఎస్​ కల్పించింది. ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం." - అమిత్​ షా, కేంద్ర మంత్రి

రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే - తెలంగాణ ప్రజలకు అయోధ్యలో ఉచితంగా రామదర్శనం : అమిత్​ షా

ఏడు ప్రధాన అంశాలతో బీజేపీ ఇంద్రధనస్సు మేనిఫెస్టో - వారి సంక్షేమంపైనే స్పెషల్ ఫోకస్

బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలు.. 2జీ, 3జీ ,4 జీ పార్టీలని అమిత్​ షా ఎద్దేవా చేశారు. 2 జీ అంటే కేసీఆర్‌, కేటీఆర్‌, 3జీ అంటే 3 తరాలుగా రాజకీయాలు చేస్తున్న ఓవైసీ కుటుంబ పార్టీ, 4జీ పార్టీ అంటే జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా, సోనియా, రాహుల్‌.. 4 తరాలుగా కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ రాజకీయాలు చేస్తోందని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దే అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. మద్యం కుంభకోణాలకు సైతం వెనకాడలేదన్నారు.

'2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఏపీని నిధులివ్వకుండా కాంగ్రెస్‌ మోసం చేసింది. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మించలేకపోయారు. అయోధ్యలో రామమందిరం నిర్మించకుండా కాంగ్రెస్‌ అన్యాయం చేసింది. జనవరి 22న అయోధ్యలో రామ్‌లాల్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వండి. తెలంగాణ ప్రజలకు అయోధ్యలో ఉచితంగా రామ దర్శనం చేయిస్తాం.' అని అమిత్‌ షా అన్నారు.

అమిత్ షాకు తప్పిన పెను ప్రమాదం- ప్రచార రథానికి కరెంట్​ షాక్, ర్యాలీ రద్దు చేసుకుని వెనక్కి

Last Updated : Nov 18, 2023, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details