Amit Shah Sister Passed Away :పండుగ వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోదరి రాజేశ్వరిబెన్ (60) ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. రాజేశ్వరిబెన్ భౌతిక కాయాన్ని ఆమె నివాసానికి సోమవారం ఉదయం తీసుకువచ్చారు.
పండుగ వేళ అమిత్ షా కుటుంబంలో తీవ్ర విషాదం - అమిషా సోదరి రాజేశ్వరిబెన్ కన్నుమూత
Amit Shah Sister Passed Away : పండుగ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి రాజేశ్వరిబెన్ (60) సోమవారం తుదిశ్వాస విడిచారు.
Amit Shah Sister Passed Away
Published : Jan 15, 2024, 2:58 PM IST
అహ్మదాబాద్లో ఆదివారం నుంచి అమిత్ షా బీజేపీ కార్యకర్తలతో సంక్రాంతి జరుపుకుంటున్నారు. సోమవారం బనస్కాంత, గాంధీనగర్ జిల్లాల్లో రెండు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన అక్క మరణించడం వల్ల అమిత్ షా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు.