తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వచ్చే జనవరి నాటికి అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి'.. అమిత్​ షా కీలక ప్రకటన

కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామమందిరం 2024 జనవరి ఒకటో తేదీ నాటికి సిద్ధమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. త్రిపురలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేందుకు వెళ్లిన అమిత్ షా.. అయోధ్య రామమందిరంపై కీలక ప్రకటన చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 6, 2023, 7:53 AM IST

వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గురువారం వెల్లడించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలోని ఓ రథయాత్రలో అమిత్‌షా పాల్గొన్నారు.''రాహుల్‌ బాబా! సబ్రూమ్‌ నుంచి చెబుతున్నా విను.. అయోధ్య రామమందిరం జనవరి 01, 2024 నాటికి పూర్తవుతుంది'' అని ఘాటుగా అన్నారు. కాంగ్రెస్​, కమ్యూనిస్టు పార్టీలే రామ మందిర సమస్యను ఏళ్ల తరబడి కోర్టులో మగ్గిపోయేలా చేశాయని ఆరోపించారు. కానీ సుప్రీం కోర్టు తీర్పు​ వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ రామ మందిరానికి భూమి పూజ చేశారన్నారు. రామమందిరం అంశాన్ని 1990లో తమ అగ్ర నేత ఎల్​కే అడ్వాణీ రథయాత్ర చేపట్టిన నుంచి లేవనెత్తుతోంది భాజపా. ఇప్పుడు కూడా మరోసారి ఆ అంశాన్ని తెరపైకి చెచ్చి 2024లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అస్త్రంగా ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ అధిర్​ రంజన్​ చౌదరి స్పందించారు. దేశంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించకుండా.. 2024 ఎన్నికలకు నినాదాలను ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. త్రిపురలో కాంగ్రెస్​, కమ్యూనిస్టులతో పాటు త్రిణమూల్​ కాంగ్రెస్​ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా షా వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ.. పొలిటికల్​ మైలేజ్​ కోసం వాడుకోవడం సరైందని కాదని ఆరోపించింది.

రథయాత్రతో పుంజుకున్న భాజపా..
1990లలో ఎల్​కే అడ్వాణీ చేపట్టిన రథయాత్ర భాజపా బలం పంజుకోవడానికి పునాదులు వేసింది. ఆ యాత్రలో భాగంగాన్ 16వ శతాబ్దంలో కట్టిన మసీదు శ్రీరాముడు జన్మించిన ప్రాంతమని, దాన్ని కూల్చేయాలని భాజపా శ్రేణులు పిలుపునిచ్చాయి. దీంతో డిసెంబర్​ 1992లో కాషాయ దళాలు బాబ్రీ మసీదును కూల్చేశాయి. దశబ్దాల తర్వాత 9 నవంబర్ 2019న రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సూప్రీం కోర్టు ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది. అనంతరం 5 ఆగస్టు 2020లో ప్రధాని నరేంద్ర మోదీ అయోద్య రామ మందిరానికి భూమి పూజ చేశారు.

ABOUT THE AUTHOR

...view details