తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిశ్చింతగా దేశాన్ని రక్షించండి.. మీ కుటుంబ బాధ్యత మాది' - సీఏపీఎఫ్ ఆయుష్మాన్ న్యూస్

సీఏపీఎఫ్ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సీఏపీఎఫ్ సిబ్బంది నిశ్చింతగా దేశ రక్షణలో పాల్గొనాలని అన్నారు. సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.

AMIT SHAH CAPF
అమిత్ షా న్యూస్

By

Published : Nov 3, 2021, 9:21 AM IST

ఆయుష్మాన్ భారత్ సీఏపీఎఫ్ పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అందుబాటులోకి తెచ్చారు కేంద్ర హోంమంత్రి (Amit Shah news) అమిత్ షా. దిల్లీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఓ సీఏపీఎఫ్ జవానుకు ఆయుష్మాన్ కార్డు (Ayushman Bharat card) అందించారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు.

'ఆయుష్మాన్ సీఏపీఎఫ్' పథకం వివరాలను తెలియజేసే హెల్త్ కార్డులను ఎన్ఎస్​జీ డైరెక్టర్ జనరల్​కు అందించారు షా. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఏపీఎఫ్ సిబ్బందికి మోదీ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా దేశరక్షణ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.

35 లక్షల కార్డుల పంపిణీ

ఆయుష్మాన్ సీఏపీఎఫ్ పథకం (Ayushman Bharat Yojana) ఈ ఏడాది జనవరి 23న అసోంలోని గువాహటిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ, జాతీయ వైద్య ప్రాధికార సంస్థ(ఎన్​హెచ్ఏ) సంయుక్తంగా ఈ పథకాన్ని తీసుకొచ్చాయి. సీఏపీఎఫ్ సిబ్బందికి క్యాష్​లెస్, పేపర్​లెస్ విధానంలో వైద్య సేవలు అందించేలా దీన్ని రూపొందించారు. తాజాగా ప్రారంభమైన హెల్త్ కార్డుల పంపిణీ ఈ ఏడాది డిసెంబర్​లో పూర్తికానుంది. మొత్తం 35 లక్షల కార్డులు పంపిణీ చేయనున్నారు.

ఇదీ చదవండి:పండగ వేళ ప్రపంచ రికార్డుకు సిద్ధమైన అయోధ్య

ABOUT THE AUTHOR

...view details