దేశంలో కరోనా మళ్లీ క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన పెరగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. కొవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వ్యాక్సినేషన్ సహా, వైరస్‌ను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా.. సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. వైరస్ ప్రభావిత రాష్ట్రాలకు అందించే సహాయ సహకారాలపై కూడా చర్చించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కర్ణాటకలో ఆంక్షలు కఠినతరం
అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి నిషేధం విధించటం లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారు 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. నెగెటివ్‌గా తేలిన వారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పింది.
కేరళలో ఎంట్రీ పాయింట్లు బంద్
వయనాడ్, కాసర్గోడె జిల్లాల్లోని 13 ఎంట్రీ పాయింట్లను కేరళ ప్రభుత్వం మూసివేసింది. దీంతో కర్ణాటక సరిహద్దులో నివసించే కేరళ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి కేరళకు వచ్చే వారు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కేరళలో ఫిబ్రవరి 21 వరకు 58,000 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నాగ్‌పుర్‌లో మార్చి 7 వరకు..
మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నాగ్‌పుర్ జిల్లాలో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ తెలిపారు. కళాశాలలు, పాఠశాలలు, శిక్షణా తరగతులను మార్చి 7 వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 7వరకు ఎలాంటి రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలను నిర్వహించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.
దిల్లీలో ప్రజారవాణాపై ఆంక్షలు