తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ ఐక్యత, సమగ్రతను ఎవరు దెబ్బతీయలేరు: షా - పటేల్​ జయంతి

దేశ ఐక్యత, సమగ్రతను ఎవరు దెబ్బతీయలేరనే సందేశాన్ని సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. పటేల్​ జయంతి సందర్భంగా.. గుజరాత్​ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన 'రాష్ట్రీయ ఏక్తా దివస్​' పరేడ్​ను వీక్షించారు.

SardarPatel's birth anniversary
ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు అమిత్​ షా నివాళి

By

Published : Oct 31, 2021, 9:36 AM IST

Updated : Oct 31, 2021, 11:54 AM IST

రాష్ట్రీయ ఏక్తా దివస్​ వేడుకలను తిలకించిన అమిత్ షా

భారతదేశ ఐక్యత, సమగ్రతను ప్రపంచంలో ఎవరూ దెబ్బతీయలేరనే సందేశాన్ని సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. పటేల్​ జయంతి సందర్భంగా.. గుజరాత్​ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదని గుర్తు చేసిన ఆయన.. ఈ ప్రాంతం కేవలం పటేల్​ స్మారకంగానే కాకుండా దేశ భక్తిని పెంపొందించే పుణ్యక్షేత్రంగా మారిందన్నారు.

జాతీయ ఐక్యత దినోత్సవానికి ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ముక్కలు చేయడానికి బ్రిటీషర్ల కుట్ర పన్నారు. సర్దార్‌ పటేల్‌ వారి కుట్రను భగ్నం చేశారు. అఖండ్‌ భారత్‌ చేయాలని సంకల్పించారు పటేల్​. ఇక్కడ నిర్మించిన ఎత్తైన పటేల్‌ విగ్రహం ఉజ్వలమైన దేశ భవిష్యత్తుకు సూచికలాంటిది. ఇది దేశ ఐక్యత, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరనే సందేశం ఇస్తుంది.

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది అక్టోబర్​ 31న దేశం 'రాష్ట్రీయ ఏక్తా దివస్' జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఐక్యతా విగ్రహాన్ని అమిత్​ షా సందర్శించారు. పటేల్​ విగ్రహానికి నివాళులర్పించి.. దేశ సేవకు మహా నేత చేసిన కృషిని స్మరించుకున్నారు.

ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు అమిత్​ షా నివాళి
పరేడ్​ను వీక్షిస్తున్న అమిత్​ షా

అనంతరం పటేల్​ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 'రాష్ట్రీయ ఏక్తా దివస్​' పరేడ్​ను వీక్షించారు హోం మంత్రి. ఒలింపిక్స్​లో పతకం సాధించిన భారత హాకీ టీం కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​తో పాటు మరికొందరు జట్టు సభ్యులు ఈ పరేడ్​లో పాల్గొన్నారు. ఈ వేడుకలో అమిత్​ షా ధరించిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఐక్యతా విగ్రహం వద్ద పోలీసుల పరేడ్​
ఐక్యతా విగ్రహం వద్ద పరేడ్​లో పాల్గొన్న అధికారులు

సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా.. నితిన్​ గడ్కరీ, పీయూష్​ గోయల్​, పలువురు ప్రముఖులు ట్విట్టర్​ వేదికగా నివాళులర్పించారు.

ఇదీ చూడండి:'పటేల్ స్ఫూర్తితోనే భారత్ అన్ని సవాళ్లు ఎదుర్కొంటోంది'

Last Updated : Oct 31, 2021, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details