కేంద్ర హోంమంత్రి, భాజపా సీనియర్ నేత అమిత్ షా గురువారం నుంచి రెండు రోజులు బంగాల్లో పర్యటించనున్నట్లు భాజపా సీనియర్ నేత వెల్లడించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలపై బంకురా, కోల్కతాలోని పార్టీ శ్రేణులతో మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.
" నవంబర్ 4న షా కోల్కతాకు చేరుకుంటారు. నవంబర్ 5న మిద్నాపూర్, బీర్భం, పురూలియా, బంకురా జిల్లాలకు చెందిన భాజపా శ్రేణులతో బంకురాలో సమావేశమవుతారు. తర్వాత రోజు... క్లాసికల్ సింగర్ పండిట్ అజయ్ చక్రవర్తిని కలుస్తారు. అనంతరం కోల్కతాలోని భాజపా పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు".