తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ భద్రతపై అమిత్​ షా కీలక సమావేశం

Amit Shah Meeting: ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు, సైబర్‌స్పేస్‌ను అక్రమంగా వినియోగించుకోవడం, ముష్కరుల కదలికలు వంటి వాటితో పాటు దేశంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉన్నతాధికారులతో సోమవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. అమిత్​ షా కొత్త ఏడాదిలో ఉన్నతాధికారులతో సమావేశం కావడం ఇదే తొలిసారి.

amit shah meeting
దేశ భద్రతపై అమిత్​ షా కీలక భేటీ

By

Published : Jan 3, 2022, 8:12 PM IST

Updated : Jan 3, 2022, 10:19 PM IST

Amit Shah Meeting: దేశ భద్రత, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. అధికారులతో చర్చించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఉగ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా ఉండే తీవ్రవాద సంస్థల నుంచి వస్తున్న బెదిరింపులు, ఉగ్రసంస్థల ఆర్థిక మూలాలు, నార్కో టెర్రరిజం, సైబర్‌స్పేస్‌ను అక్రమంగా ఉపయోగించడం, విదేశీ ఉగ్రవాద కదలికలపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపింది.

అధికారులతో అమిత్​ షా సమావేశం

మారుతున్న ఉగ్రవాదాన్ని, భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం అవసరం అని హోం మంత్రి అమిత్​ షా అన్నారు. ఈ భేటీలో కేంద్ర భద్రతా సంస్థలైన కేంద్ర సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్​ విభాగం, భద్రతా దళాలు, రెవెన్యూ, ఫైనాన్సియల్​ ఇంటెలిజెన్స్​ విభాగాలు పాల్గొన్నాయి.

దేశ భద్రతపై అమిత్​ షా సమావేశం

కొత్త ఏడాదిలో.. అమిత్​ షా ఉన్నతాధికారులతో సమావేశం కావడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి :మాజీ ఎమ్మెల్యే బంధువు అరెస్ట్​- ఐసిస్​తో లింకులే కారణం!

Last Updated : Jan 3, 2022, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details