Amit Shah Election Campaign in Telangana: రాష్ట్రంలో ఎన్నికల్లో కీలక ఘట్టంమైన పోలింగ్ మరో ఐదు రోజులు మాత్రమే ఉన్నందున.. జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ ప్రచారంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు హామీలతో ఓటులు అడిగేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకు సంబంధించిన జాతీయ నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరుఫున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తదితర ప్రముఖ బీజేపీ నాయకులు ప్రచారంలో బిజిగా ఉన్నారు.
Amit Shah Election Campaign Today : కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో బీజేపీ(BJP) నాయకులు నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థినే సీఎం చేస్తామని మళ్లీ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రైతులకు ఎకరాకు 25 శాతం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని.. ప్రజారోగ్యం కోసం 10 లక్షల బీమా కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ఉప్పల్లో అమిత్ షా రోడ్ షో- బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్
Amit Shah Telangana Tour :ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని అమిత్ షా మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్(BRS) కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే 2000 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.