తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫలితాలపై  నితీశ్​, అమిత్​ షా చర్చ - బిహార్​ ఎన్నికల ఫలితాలు

బిహార్​లో ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​తో ఫోన్​లో చర్చించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఈ మేరకు జేడీ(యూ) అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నితీశ్​ను కలిసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​.. నితీశ్​ ఇంటికి వెళ్లారు.

Amit Shah dials Nitish as NDA maintains marginal lead in Bihar
బిహార్​ ఎన్నికల విశ్లేషణపై సీఎం నితీశ్​, అమిత్​ షా చర్చ

By

Published : Nov 10, 2020, 8:14 PM IST

బిహార్​లో ఎన్నికల ఫలితాల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. సీఎం నితీశ్​ కుమార్​తో మాట్లాడారని జేడీయూ వర్గాలు తెలిపాయి. అయితే ఇరువురూ ఫోన్​లో సంభాషించిన అంశాలను వెల్లడించేందుకు వారు నిరాకరించినప్పటికీ.. ఎన్నికల ఫలితాలపైనే చర్చించారని పేర్కొన్నారు.

ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు ఎన్డీయే.. మహాకూటమిపై స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.

అయితే.. ఎన్నికల్లో భాజపా, జేడీ(యూ) గెలుపొందే సీట్లతో సంబంధం లేకుండా కూటమి తరఫున నితీశ్​ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటారని షా ఇప్పటికే ప్రకటించారు.

నితీశ్​ను కలవనున్న సుశీల్​..

బిహార్​ ఉప ముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ, రాష్ట్ర భాజపా ఇంఛార్జ్​ భూపేందర్​ యాదవ్​లు.. సీఎం నితీశ్​ కుమార్​ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.

ఇదీ చదవండి:బిహార్​లో హోరాహోరీ- పిక్చర్​ అబీ బాకీ హై!

ABOUT THE AUTHOR

...view details