తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్ ఓ 'పర్యటక రాజకీయ నేత': షా - శబరిమల ఆలయం

రాహుల్​ గాంధీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు హోంమంత్రి అమిత్ షా. ఆయనో పర్యటక రాజకీయ నేత అని పేర్కొన్నారు. కేరళలో ఓ ర్యాలీలో పాల్గొన్న షా.. శబరిమల ఆందోళనల వేళ కాంగ్రెస్​ మౌనం వహించిందని ధ్వజమెత్తారు.

Amit Shah calls Rahul Gandhi 'tourist politician'
రాహుల్.. ఓ 'పర్యాటక రాజకీయ నేత': అమిత్ షా

By

Published : Apr 4, 2021, 6:19 AM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. ఒక 'పర్యటక రాజకీయ నేత' అని అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమేఠీలో 15 ఏళ్లు ఎంపీగా ఉండి, ఏమీ అభివృద్ధి చేయని ఆయన, కేరళ వయనాడ్​లోనూ ఏమీ చేయరని విమర్శించారు. ఇక్కడ శనివారం ఓ ర్యాలీలో పాల్గొన్న షా.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్​పై విమర్శనాస్త్రాలు సంధించారు.

"వయనాడ్​.. రాహుల్​ బాబా నియోజకవర్గం. అమెఠీకి ఆయన 15 ఏళ్లు ఎంపీగా ఉన్నా.. దాని అభివృద్ధికి ఏ ఒక్క పనీ చేయలేదు. ఇప్పుడాయన వయనాడ్​కు మారారు. రాహుల్​ బాబా లాంటి పర్యటక రాజకీయ నాయకుడిని నేనెక్కడా చూడలేదు. ఈ ప్రాంతం అభివృద్ధికీ ఆయన ఏమీ చేయరు."

- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

శబరిమల ఆలయంలో నిరసనల పట్ల కాంగ్రెస్​ మౌనం వహించడాన్ని అమిత్ షా తప్పుబట్టారు. అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్​ జరుగుతుంటే ఆ పార్టీ ఏమీ మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ఆలయాలను భక్తులే నిర్వహించాలని, నాస్తికులు కాదని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి:'సీపీఎం ముక్త్ భారత్ అని మోదీ అనరేం?'

ABOUT THE AUTHOR

...view details