కరోనా టీకాల కొరతతో సతమతమవుతున్న భారత్‌కు కాస్త ఉపశమనం లభించనుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులు శనివారం దేశానికి రానున్నాయి. రష్యా నుంచి హైదరాబాద్‌కు ఇవి చేరుకోనున్నాయని అధికార వర్గాలు చెప్పాయి. గణనీయమైన సంఖ్యలో డోసులు రానున్నట్లు తెలిపాయి.
నేడు భారత్‌కు రానున్న 'స్పుత్నిక్' టీకా డోసులు - భారత్ స్పుత్నిక్ టీకా డోసులు సరఫరా
దేశంలోని కరోనా వ్యాక్సిన్ కొరతను తీర్చేలా.. రష్యా టీకాలు భారత్‌కు రానున్నాయి. శనివారం ఇవి హైదరాబాద్‌కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో డోసులు వస్తాయని చెప్పారు.
నేడు భారత్‌కు రానున్న 'స్పుత్నిక్' టీకా డోసులు
దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు స్పుత్నిక్ వీ ఉపయోగపడనుంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల తర్వాత మూడో వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వీ అందుబాటులోకి రానుంది. నెల రోజుల వ్యవధిలో 50 లక్షల డోసులు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి-'18ప్లస్'కు వ్యాక్సిన్.. రాష్ట్రాలేమంటున్నాయ్?