దేశ రాజధాని దిల్లీలో నెలకొన్న కరోనా ఉద్ధృతి పరిస్థితులపై అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆదేశాలు జారీ చేయాలని దిల్లీ హైకోర్టును కోరారు.అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆప్ నేతలు ఎవరూ స్పందించలేదు.
"ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు చాలా సిగ్గుపడుతున్నా. నా వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కనీసం ప్రభుత్వం కూడా వారికి మద్దతుగా నిలువలేకపోతుంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నా మాట ఎవరూ వినడం లేదు. నేనూ ఎవరినీ సంప్రదించలేకపోతున్నా. దిల్లీలో పరిస్థితులు ఏం బాగోలేవు. దిల్లీ హైకోర్టు కలగచేసుకొని తక్షణమే మూడు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలి. లేకపోతే నగరంలో శవాల కుప్పలు చూడాల్సివస్తుంది. "
-షోయబ్ ఇక్బాల్, ఆప్ ఎమ్మెల్యే
యోగి ప్రభుత్వం విఫలం: భాజపా ఎమ్మెల్యే