Assam Lottery Scheme: రెండు దశాబ్దాల విరామం తర్వాత రాష్ట్రంలో లాటరీ విక్రయాలను ప్రారంభించాలని యోచిస్తోంది అసోం ప్రభుత్వం. ప్రతి సంవత్సరం రూ.2,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాష్ట్రంలో లాటరీని నిషేధించినప్పటికీ, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా నడుస్తున్నాయని.. దీంతో రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.2,500 కోట్ల వరకు ప్రభావం పడుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నష్టాన్ని అరికట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
20ఏళ్ల తర్వాత లాటరీ వ్యాపారంలోకి ప్రభుత్వం.. భారీగా ఆదాయం! - అస్సాం న్యూస్
Assam Lottery Scheme: రెండు దశాబ్దాల క్రితం నిషేధించిన రాష్ట్ర లాటరీ విక్రయాలను తిరిగి ప్రారంభించాలని అసోం ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఈ విషయంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని హితవు పలికాయి.
ప్రభుత్వం దివాలా తీసిందనటానికి లాటరీ ప్రారంభించడమే నిదర్శమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఆదాయాన్ని సంపాదించే మార్గాలు ఆలోచించకుండా.. ప్రజల జీవితాలను ఫణంగా పెట్టి ఆదాయాన్ని సంపాదించాలనుకుంటోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. డ్రగ్స్ కంటే లాటరీ పెద్ద వ్యసనమని.. రెండు దశాబ్దాల క్రితమే రాష్ట్రం చాలా నష్టపోయిందని.. ఇప్పుడు మళ్లీ లాటరీని ప్రారంభిస్తే సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ మండిపడింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాడ్ చేసింది. అసోం రాష్ట్రంలో లాటరీ బాగా ప్రాచుర్యం పొందింది. 1990ల్లో లాటరీ సమాజంపై ప్రతికూల ప్రభావం చూపడం వల్ల దీనిపై నిషేధం విధించారు.
ఇదీ చదవండి:యూపీలో యోగి మార్క్ పాలన.. 'ఏ ఫైలూ మూడ్రోజులకు మించి పెండింగ్‌లో ఉండొద్దు'