దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7.9 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 16,38,464 టీకా డోసులు అందించినట్లు చెప్పింది.
టీకా తీసుకున్న 118 ఏళ్ల వృద్ధురాలు
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో తుల్సాబాయ్ అనే 118 ఏళ్ల వృద్ధురాలు.. కొవిడ్ టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచారు. దేశంలో ఇప్పటివరకు టీకా తీసుకున్నవారిలో తుల్సాబాయే అత్యధిక వయస్కురాలు కావటం గమనార్హం. అంతకుమందు బెంగళూరుకు చెందిన జె.కామేశ్వరి(103).. పేరిట ఈ రికార్డు ఉండేది.
కరోనా టీకా వేయించుకుంటున్న 118 ఏళ్ల వృద్ధురాలు తుల్సాబాయ్ టీకా తీసుకున్న యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. లఖ్‌నవూ సివిల్ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ కేంద్రంలో ఆయన టీకా వేయించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ నిబంధనలను పాటించాలని కోరారు.
టీకా వేయించుకుంటున్న ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి వ్యానుల్లో వ్యాక్సినేషన్..
కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో.. వైరస్ కట్టడి కోసం పంజాబ్‌లోని లూధియానా జిల్లా అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఆర్టీ- పీసీఆర్ పరీక్ష కేంద్రాలను కియోస్క్‌ల రూపంలో ఏర్పాటు చేశారు. అలాగే.. వ్యానుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పంజాబ్‌లోని లూధియానాలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది పంజాబ్‌లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు
"త్వరలోనే 200 వ్యాక్సినేషన్ వ్యానులను మేం ఏర్పాటు చేస్తాం. మాస్కులు లేకుండా కనిపించిన వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు మొబైల్ బృందాలను మేం రంగంలోకి దించుతున్నాం."
-సివిల్ సర్జన్, లూధియానా
ఉచిత భోజనం..
గుజరాత్ రాజ్‌కోట్‌లోని టీకా పంపిణీ కేంద్రంలో ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేసింది ఓ స్వచ్ఛంద సంస్థ. "వ్యాక్సిన్ తీసుకున్నాక ఇంటికి వెళ్లి, ప్రజలు వంట కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు మేం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో టీకా తీసుకున్న తర్వాత వారు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోగలరు." అని సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తెలిపారు.
టీకా పంపిణీ కేంద్రం వద్ద వంట చేస్తున్న స్వచ్ఛంద సంస్థ సిబ్బంది వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద భోజన వసతి జవాన్లకు రెండో డోసు..
జమ్ముకశ్మీర్ రామ్బాగ్లోని వ్యాక్సినేషన్ కేంద్రంలో సీఆర్పీఎఫ్ జవాన్లు కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు.
రామ్బాగ్లోని టీకా పంపిణీ కేంద్రంలో ఎదురు చూస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు టీకా రెండో డోసు వేయించుకుంటున్న సీఆర్పీఎఫ్ జవాన్ దేశంలో కరోనా విజృంభణ ఆందోళనకరంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే.. 1,03,558 మంది.. వైరస్ బారినపడ్డారు.
ఇదీ చూడండి:'జోధ్‌పుర్ ఐఐటీ'పై కొవిడ్ పంజా