కొవిడ్ ఆంక్షలు(Covid-19 Norms), భౌతికదూరం, మాస్కుధారణ(Corona Guidelines).. తదితర అంశాలపై నిర్వహించిన సర్వేలో విస్తురపోయే విషయాలు బయటకొచ్చాయి. లోకల్ సర్కిల్స్ అనే డిజిటల్ సంస్థ.. దేశవ్యాప్తంగా 366 జిల్లాల్లో 20వేల మందిపై సర్వే నిర్వహించింది.
సర్వేలో వెల్లడైన విషయాలు..
- మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కచ్చితంగా పాటిస్తున్నారని 2శాతం మంది భారతీయులు మాత్రమే భావిస్తున్నారు.
- తమ జిల్లాల్లోని ప్రజలు.. భౌతిక దూరం(Corona Guidelines) నియమాలను పాటిస్తున్నట్లు 3శాతం మంది ప్రజలు మాత్రమే అనుకుంటున్నారు.
- తమ ప్రాంతంలో 90శాతం మందికిపైగా ప్రజలు మాస్కు ధరించటం, భౌతికదూరం పాటిస్తున్నట్లు 2 శాతం మంది మాత్రమే తెలిపారు.
- ప్రయాణాల్లో భౌతిక దూరం పాటించటం లేదని మరో 9శాతం మంది తెలిపారు.
- పండగ సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్స్లో కొవిడ్ ఆంక్షలను(Covid-19 Norms) కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోందని సర్వే తెలిపింది.
- గ్రామీణ జిల్లాలు, టైర్ 3, 4 ప్రాంతాల్లో మాస్కు ధారణ, సామాజిక దూరం విధిగా పాటించాలని అర్థమవుతోందని పేర్కొంది.
- ప్రజలు కొవిడ్ ఆంక్షలను గాలికొదిలేస్తే.. దేశవ్యాప్తంగా కొవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి అవకాశముందని అభిప్రాయపడింది.
ఈ సర్వేలో సమాధానం ఇచ్చిన వారిలో 42శాతం మంది టైర్1 జిల్లాలు, 30శాతం టైర్2, 23శాతం టైర్3, టైర్4 జిల్లాల నుంచి ఉన్నారు. ఈ సర్వేలో 65 శాతం మంది పురుషులు, 35శాతం మంది మహిళలు పాల్గొన్నారు.