మహమ్మారి వేళ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సారానికి ఆన్లైన్ వేదికగా శ్రీకారం చుట్టారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో భాగంగా సీఎం.. 1-9వ తరగతి పిల్లలకు ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. ఫస్ట్ బెల్ పోర్టల్లోని కైట్ విక్టర్స్ ఛానెల్ ద్వారా పాఠాలు వినే వెసులుబాటు కల్పించారు.
"విద్యార్థులు స్కూల్ బ్యాగ్స్, కొత్త బట్టలతో పాఠశాలలకు వచ్చే సమయం త్వరలోనే వస్తుంది. మహమ్మారి కారణంగా ఇంట్లోనే విద్యను అభ్యసిస్తున్నా.. మనం అందరం కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే దిశగా అడుగులు వేయచ్చు. రాష్ట్రం అనుసరిస్తున్న డిజిటల్ విద్యా విధానం విజయవంతమైనది."