తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైళ్లలో టికెట్​ లేకుండా 27 లక్షల మంది ప్రయాణం' - రైల్వేశాఖ ఫైన్​

గతేడాది ఏప్రిల్​ నుంచి 2021, మార్చి వరకు 27.57 లక్షల మంది రైళ్లలో టికెట్​ లేకుండా ప్రయాణించినట్లు రైల్వే బోర్డు తెలిపింది. వారి నుంచి సుమారు రూ.143 కోట్లకు పైగా జరిమానా రూపంలో వసూలు చేసినట్లు పేర్కొంది.

railwayindian railways latest
టికెట్​ లేని ప్రయాణం

By

Published : Jun 6, 2021, 9:58 PM IST

కరోనా కారణంగా రైల్వే స్టేషన్లలో ప్రవేశానికి ఎన్నో ఆంక్షలు విధించినప్పటికీ లక్షల సంఖ్యలో టికెట్‌ లేకుండా ప్రయాణించారు. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్యకాలంలో మొత్తం 27.57లక్షల మంది టికెట్‌ లేకుండా ప్రయాణించగా వారి నుంచి రూ.143.82 కోట్ల జరిమానాలు వసూలు చేసినట్లు రైల్వే బోర్డు ప్రకటించింది.

సమాచారహక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఆర్​టీఐ కార్యకర్త దాఖలు చేసిన దరఖాస్తుకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది రైల్వే బోర్డు. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య 25శాతంగా ఉంది. ఆ ఏడాది టికెట్‌ లేకుండా కోటి పది లక్షల మంది ప్రయాణించగా వారి నుంచి రూ.562 కోట్ల మేర జరిమానా వసూలు చేశారు.

కరోనా దృష్ట్యా గతేడాది రైల్వే చరిత్రలోనే అతి తక్కువ రైళ్లు నడిచాయి. అయినప్పటికీ అంతమంది టికెట్లు లేకుండా ప్రయాణించడం గమనార్హం.

ఇదీ చూడండి:'వ్యవసాయంపై కొవిడ్​ 2.0 ప్రభావం ఉండదు'

ABOUT THE AUTHOR

...view details