సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనాకు వణుకు పుట్టించేలా క్షిపణి పరీక్షలు చేపడుతోంది భారత్. తాజాగా శత్రు దేశాల యుద్ధ విమానాలను కూల్చే సామర్థ్యం గల 10 దేశీయ ఆకాశ్ వాయు రక్షణ క్షిపణులను పరీక్షించింది భారత వాయుసేన. గత వారం ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యలంక ఫైరింగ్ రేంజ్ నుంచి వీటిని విజయవంతంగా పరీక్షించారు. దాదాపు అన్ని క్షిపణులు లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు అధికారులు తెలిపారు.
" విభిన్న పరిస్థితుల్లో శత్రుమూకల విమానాలను కూల్చేందుకు కంబైన్డ్ గైడెడ్ వెపన్స్ ఫైరింగ్-2020లో భాగంగా 10 ఆకాశ్ మిసైల్స్‌ను వాయుసేన పరీక్షించింది. వాటితో పాటు ఇగ్లా షోల్డర్-ఫైర్డ్ వాయు రక్షణ క్షిపణులనూ పరీక్షించారు. తూర్పు లాద్దాఖ్తో పాటు ఇతర సెక్టార్లలో ఈ రెండు వ్యవస్థలను మోహరించారు. "
- అధికార వర్గాలు