ఇప్పటివరకు మద్యం సేవించి వాహనం నడిపితేనో.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తేనో ఫైన్ వేసేవారు పోలీసులు. కానీ ఇకపై టీకా ఫైన్ కూడా కట్టాల్సి రావచ్చు! టీకా ప్రక్రియను వేగవంతం చేయడానికి ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్నంగా ఆలోచించింది. వ్యాక్సిన్ వేసుకోకుండా బయట తిరిగే వారిపై రూ.500 జరిమానా విధించాలని ఆలోచిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. 45ఏళ్ల పైనున్న వయస్సు వారిపై ఇది అమలు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
టీకా తీసుకోకుండా తిరిగితే.. రూ.500 ఫైన్! - Aurangabad vaccine news
టీకా వేసుకోవాలని సూచించినా.. నగరవాసులు నిర్లక్ష్యం వహించటంపై ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొరడా ఝళిపించనుంది. వ్యాక్సిన్ వేసుకోకుండా బయట తిరిగే వారిపై రూ.500 జరిమానా విధించాలనే ప్రతిపాదనపై సమాలోచనలు చేస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు.
టీకా తీసుకోకపోతే జరిమానా
ఔరంగాబాద్ నగరంలో దాదాపు 17లక్షల జనాభా ఉంది. అందులో కేవలం 3.08లక్షల మంది.. అంటే మొత్తం జనాభాలో 20శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు. జూన్ చివరి నాటికి కనీసం 5లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు నగరవాసులు సహకరించటం లేదని అధికారులు భావించారు. జరిమానా విధిస్తే.. టీకా వేసుకుంటారని యోచిస్తున్నారు.
ఇదీ చదవండి:'రాహుల్.. వ్యాక్సిన్లు ఏమవుతున్నాయో తెలీదా?'