ఓ వైపు కొడుకు చనిపోయాడన్న వార్త. మరోవైపు అంబులెన్సు అవసరమని హెల్ప్‌లైన్ సెంటర్ నుంచి ఫోన్... ఈ పరిస్థితుల్లో తండ్రి స్థానంలో ఉండే ఏ వ్యక్తి అయినా ఏం చేస్తాడు? దూరమైన తన కుమారుడి దగ్గరికి వీలైనంత తొందరగా వెళ్తాడు. కానీ ఆయనలా చేయలేదు. ఆపదలో ఉన్న మరొకరికి సాయం చేయడమే తన కర్తవ్యంగా భావించారు. ముందుగా తన విధులను పూర్తి చేసుకున్న తర్వాతే.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన కుమారుడి శవాన్ని చూసేందుకు వెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకలోని మైసూరుకు చెందిన ముబారక్ అనే వ్యక్తి అంబులెన్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం తన కొడుకు నీటిలో పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.