భారీ మొత్తంలో డబ్బులిస్తేనే కొవిడ్ రోగి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తానని క్రూరంగా ప్రవర్తించాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. ఈ బాధాకరమైన ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరిగింది.
రూ. 80 వేలు అశించి..
భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) సంస్థలో ఏజీఎంగా పనిచేస్తున్న ఓ వ్యక్తి శుక్రవారం కొవిడ్‌తో హర్ మిలాప్ మిషన్ రాజ్‌కియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే.. మృతుడి తనయుడు అమెరికాలో నివాసం ఉంటున్నాడని, తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తనకు ఆలస్యమవుతుందని.. ఆ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉంచాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆలోచించారు.