తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రికి వెళ్లాక ఓపెన్ కాని అంబులెన్స్​ డోర్​, అరగంట శ్రమించినా నో యూజ్, వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. అయితే అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకున్నాక అరగంటపాటు డోర్ ఓపెన్ కాలేదు. ఆ వాహనంలోనే క్షతగాత్రుడు మరణించాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.

ambulance door jammed
అంబులెన్స్ డోర్ తెరచుకోక వృద్ధుడు మృతి

By

Published : Aug 30, 2022, 2:33 PM IST

కేరళ కోజికోడ్‌లో దారుణం జరిగింది. ద్విచక్రవాహన ప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధుడ్ని అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్నాక అంబులెన్స్ డోర్​ తెరచుకోలేదు. దీంతో సకాలంలో చికిత్స అందక కోయమోన్(66) ఆస్పత్రి వద్దే మరణించాడు. మృతుడు ఫిరోక్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఈ హృదయవిదారక ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయమోన్ అనే వృద్ధుడిని సోమవారం మధ్యాహ్నం బైక్​ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడ్ని బీచ్​ ఆసుపత్రికి అంబులెన్స్​లో తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరుకున్నాక 30 నిమిషాల పాటు అంబులెన్స్ డోర్​ తెరచుకోలేదు. డ్రైవర్​, సహాయకుడు డోర్​ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో ఉన్న కోయమోన్.. అంబులెన్స్​లో కొన ఊపిరితో నరకం చూశాడు.

అంబులెన్స్ డోర్ తెరచుకోక వృద్ధుడు మృతి

స్థానికులు అంబులెన్స్ కిటికీల అద్దాలను బద్దలగొట్టి కోయమోన్​ను బయటకు తీశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వ్యవహారంపై రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:కుమార్తెపై తండ్రి అత్యాచారం, బిడ్డకు జన్మనిచ్చిన బాలిక, బెయిల్​పై వచ్చి మరోసారి రేప్​

ఆప్ వర్సెస్ భాజపా, అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా, పోటాపోటీ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details