రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజే కస్టడీని ఏప్రిల్ 9 వరకు పొడగించింది ఎన్ఐఏ న్యాయస్థానం. కేసుపై మరింత దర్యాప్తు చేయాల్సి ఉన్న నేపథ్యంలో కస్టడీని పెంచాలని న్యాయస్థానాన్ని ఎన్ఐఏ కోరింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఏప్రిల్ 9 వరకు కస్టడీని పొడిగించింది.
ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాల కేసు సహా.. వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాజేను ఎన్‌ఐఏ.. మార్చి 13న అదుపులోకి తీసుకుంది.