రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలకేసులో అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ రియాజ్ కాజీకి ఈ నెల 23 వరకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు కస్టడీ విధించింది.
జ్యుడీషియల్ కస్టడీకి వాజే అసిస్టెంట్ రియాజ్
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్టైన రియాజ్ కాజీ అనే అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్కు ఈ నెల 23వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది ఎన్ఐఏ కోర్టు.
రియాజ్ కాజీ
ఈ కేసులో సస్పెండైన సచిన్ వాజేకు రియాజ్ కాజీ సహకారం అందించినట్లుగా భావిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. కాజీని ఏప్రిల్ 11న ఎన్ఐఏ అరెస్టు చేయగా. . శుక్రవారంతో రిమాండ్ ముగిసింది. తదుపరి రిమాండ్ కోరకపోవడం వల్ల కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఇదీ చదవండి:సచిన్ వాజేకు ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు