మహిళల లోదుస్తులు కర్ణాటక జెండా రంగుల్లో ఉండటం వివాదానికి దారి తీసింది. దుస్తులు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో కనిపించినట్లు ఆ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీకేడీఎంహెచ్హెచ్హెచ్ బ్రాండ్‌తో ఉన్న లోదుస్తులపై జెండా రంగులు ముద్రించినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక అటవీ శాఖ మంత్రి అరవింద్ లింబావలి. కన్నడను అవమానించే ధోరణి మానుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు. ఈ అంశం ఆత్మగౌరవానికి సంబంధించినదని, అలాంటి వాటిని సంహించబోమన్నారు. అమెజాన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కన్నడ జెండా రంగుల్లో లోదుస్తులు(బికినీ) కనిపించటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రులకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రజలకు అమెజాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.