Best Deals on Office Chairs in Amazon Festival Sale 2023 :ప్రస్తుతం వరుస పండగల నేపథ్యంలో.. "అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023" కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా.. అమెజాన్ అన్ని రకాల ఉత్పత్తులపై భారీ డీల్స్.. తగ్గింపులను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి హోమ్ డివైజ్‌ల వరకు అన్ని పరికరాలపైనా అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తోంది. ధర, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లపై తగ్గింపుతోపాటు.. SBI డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అమెజాన్ అందిస్తోంది. ఈ క్రమంలో మీరు మంచి ఆఫీస్ చైర్ కోసం చూస్తున్నట్లయితే.. ఇప్పుడే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023(Amazon Festival Sale 2023)లో అందుబాటులో ఉన్న బ్రాండెడ్ కంపెనీ కుర్చీలపై ఓ లుక్కేయండి. అదిరిపోయే ఆఫర్లతో తక్కువ ధరకే మీకు నచ్చిన కుర్చీని సొంతం చేసుకోవచ్చు. మరి, అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఆఫీస్ కూర్చీలపై ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం...
Da URBAN Merlion Office Chair :
- Da URBAN Merlionఆఫీస్ చైర్ చాలా తక్కువ ధరకే అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉంది. ఇది 74% ఆఫర్‌తో.. 6,999 రూపాయలకు అమెజాన్‌లో లభిస్తోంది.
- తయారీదారులు చెబుతున్న స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
- ఈ కుర్చీ వెనుక భాగం.. మానవ శరీరం సహజ వక్రరేఖకు సరిగ్గా సరిపోయేలా రూపొందించబడింది. దీనిలో కూర్చోవడం ద్వారా ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన ఫీలింగ్ పొందుతారు.
- కుషన్‌లు మందంగా ఉంటాయి. అధిక సాంద్రత కలిగిన శ్వాసక్రియ మెష్‌తో తయారు చేయబడ్డాయి. ఇది మీకు బెటర్ సిట్టింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది.
- ఈ డెస్క్ చైర్ మెష్ ఫాబ్రిక్‌తో మందపాటి అచ్చుతో కూడిన PU సీటును కలిగి ఉంది. ఇది చెమట రాకుండా కూర్చొనే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
- సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్ మీ మెడ, తలకు సపోర్ట్‌గా రూపొందించబడింది. శరీరం మొత్తాన్ని చల్లగా, సౌకర్యవంతమైన స్థితిలో ఉంచుతుంది.
- ఈ కుర్చీలో నైలాన్‌తో తయారు చేయబడిన సీటు ఫ్రేమ్, చెక్కతో చేసిన అంతర్గత సీటు, కుషన్డ్ సీటు 3.9 అంగుళాల మందంతో.. అదనపు సౌకర్యం కోసం PUతో నిండి ఉంటుంది. ఇది స్టైలిష్ గ్రే కలర్‌లో 360º స్వివెల్ మెష్ సీట్ కవర్‌ను కలిగి ఉంది.
- ఇది గరిష్ఠంగా 120 కిలోల వరకు బరువును కలిగి ఉంటుంది.
Green Soul Jupiter Superb Office Chair :
- ఇది కూడా ఆఫీస్ చైర్లో మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. అమెజాన్ సేల్‌లో ఈ చైర్ 54% ఆఫర్‌తో రూ. 8,599కు లభిస్తోంది.
- తయారీదారులు చెబుతున్న స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి...
- ఈ కుర్చీలో high back, ప్రీమియం మెష్ బ్యాక్‌రెస్ట్ ఉంది. బ్యాక్‌రెస్ట్ 135° వరకు వంగి ఉంటుంది. అలాగే 90°నుంచి 135° మధ్య ఏ కోణంలోనైనా లాక్ చేయవచ్చు.
- ఈ డెస్క్ చైర్ 360° రొటేషన్, కుషన్డ్ సీట్, రోలింగ్ స్వివెల్ క్యాస్టర్‌లతో అనేక సౌకర్యాలను అందిస్తుంది.
- ఈ కుర్చీలో గ్లాస్‌తో కూడిన నైలాన్‌తో తయారు చేయబడిన ఫ్రేమ్, ఒక Breathable మెష్ మెటీరియల్ ఉన్నాయి.
- ఇది అదనపు ఫ్లెక్సిబిలిటీ కోసం 360º స్వివెల్ చేయగల హై బ్యాక్ చైర్, ఈ కుర్చీ సింక్రో మల్టీ-టిల్ట్ లాక్ మెకానిజం కలిగి ఉంటుంది.
- అలాగే.. సులభమైన కదలిక కోసం 50mm డ్యూయల్ క్యాస్టర్ వీల్స్‌ను కలిగి ఉంది.
- ఈ కుర్చీలో 2D adjustable ఆర్మ్‌రెస్ట్‌లు, lumbar support, పర్సనలైజ్డ్ కంఫోర్ట్ కోసం హెడ్‌రెస్ట్ కూడా ఉన్నాయి.
Diwali Smart TVs Sale 2023 : దివాళీ ఫెస్టివల్ ధమాకా సేల్.. స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు..!