Amarnath Yatra Resumes: ప్రతికూల వాతావరణం, ఆకస్మిక వరదల కారణంగా రద్దయిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. మంచు శివలింగం దర్శనానికి 4,020మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్ బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. జమ్ములోని భగవతినగర్ యాత్రి నివాసం నుంచి 110 వాహనాలు గట్టి బందోబస్తు మధ్య బేస్ క్యాంపులకు బయలుదేరినట్లు సైనికవర్గాలు ప్రకటించాయి. వారిలో 1016 మంది తెల్లవారుజామున 3:30 సమయంలో 35 వాహనాల్లో బాల్తాల్ బేస్ క్యాంపునకు బయలుదేరినట్లు తెలిపారు. మరో 2,425 మంది 75వాహనాల్లో పెహల్గామ్ బేస్ క్యాంపునకు బయలుదేరినట్లు పేర్కొన్నారు. ఈ ఉదయం ఆ మార్గంలోని నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికుల బృందం వెళ్లిందని అధికారులు తెలిపారు.
అమర్‌నాథ్ యాత్ర మళ్లీ షురూ.. గట్టి బందోబస్తు మధ్య యాత్రికుల పయనం - amarnath yatra 2022
Amarnath Yatra Resumes: ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. జమ్ములోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి.. యాత్రికులు భారీ బందోబస్తు మధ్య బేస్ క్యాంపులకు బయలుదేరారు.
అమర్‌నాథ్ యాత్ర
అమర్‌నాథ్ క్షేత్రానికి సమీపంలో ఆకస్మిక వరదల కారణంగా మూడు రోజులపాటు యాత్ర రద్దయింది. వరదల బీభత్సంతో 16 మంది మృతి చెందారు. 105 మంది గాయపడ్డారు. మరో 40 మంది వరదల్లో గల్లంతవ్వగా.. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వరద కారణంగా అమర్‌నాథ్ గుహ వద్ద చిక్కుకుపోయిన 15వేల మందికిపైగా యాత్రికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఇదీ చదవండి:యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి.. చేతికి ఇంజెక్షన్!