ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. చండీగఢ్‌లో బుధవారం మీడియాతో (Amarinder Singh New Party) సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో అమరీందర్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన కొత్త పార్టీ స్థాపనపై (Amarinder Singh New Party) అమరీందర్ సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.
కొత్త పార్టీపై నేడు అమరీందర్ సింగ్ ప్రకటన! - కెప్టెన్ అమరీందర్ సింగ్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేడు కొత్త పార్టీని (Amarinder Singh New Party) ప్రకటించే అవకాశం ఉంది. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో అమరీందర్ సింగ్ పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది.
కొత్త పార్టీపై నేడు అమరీందర్ సింగ్ ప్రకటన!
అమరీందర్ సింగ్ రాజీనామా (Amarinder Singh News) పంజాబ్ కాంగ్రెస్ వర్గాల్లో గందరగోళానికి దారి తీసింది. గత 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అమరీందర్ సింగ్.. ఆ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఒత్తిడి కారణంగా అమరీందర్ సింగ్ రాజీనామా చేశారన్న పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జి హరీశ్ రావత్ వ్యాఖ్యలకు ఈ విధంగా స్పందించారు.
ఇదీ చూడండి :నీట్ ప్రవేశాలపై కేంద్రం కీలక ప్రకటన