Amara Raja Company Chairman Galla Jayadev meet CM Revanth Reddy : తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా(Amara Raja Company)ది కీలక పాత్రని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమర్ రాజా కంపెనీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి తెలంగాణ కట్టుబడి ఉందని, అలాగే బ్యాటరీల ఉత్పత్తిలో అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్‌లో అమర్ రాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్(Galla Jayadev) మర్యాదపూర్వకంగా సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై చర్చించారు.
తెలంగాణలో వ్యాపారం విస్తరిస్తాం : గిగా కారిడార్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని అమర్ రాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. తెలంగాణలో తమ వ్యాపారాలను మరింత విస్తరిస్తామన్నారు. విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని గల్లా జయదేవ్ తెలిపారు.
రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించిన సీఎం రేవంత్, భట్టి
Amara Raja Company: తెలంగాణ రాష్ట్రంలో అమర్‌రాజా కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయింది. రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌కు అనుగుణంగా అడ్వాన్స్‌డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా ఒక గిగా కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది.