ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఓటర్ను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ప్రజలను కాంగ్రెస్ విడదీస్తోందని భాజపా అనటం హాస్యాస్పదం అన్నారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి వారిని విడదీయటంలో భాజపా నేతలు నిష్ణాతులని ఆరోపించారు. కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై భాజపా నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
" కాంగ్రెస్ నేతగా.. దేశంలోని ప్రతి ఓటర్ను నేను గౌరవిస్తాను. వారు ఏ ప్రాంతం వారని సంబంధం లేదు. ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో వారికి నచ్చిన వారిని ఎన్నుకోవచ్చు."