తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రకృతి అందాల కాణాచి.. అల్మోరా! - traditional wooden architecture of almora

అల్మోరా...! హిమాలయాల పాదాల చెంతన పొందికగా ఒదిగి ఉంటుంది ఈ అందమైన పట్టణం. చుట్టు కొండలు, కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం. అంతేకాదు ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే శతాబ్దాల నాటి చెక్క కళాకృతులతో నిర్మించిన ఇళ్లు. వీటన్నింటిని తనలో నింపుకుని దేశవ్యాప్తంగా ఎంతో మందిని పర్యటకులను ఆకర్షిస్తోంది.

almora the city of destiny in himalayas of uttarakhand
ప్రకృతి అందాల కాణాచి.. ఆల్మోరా!

By

Published : Nov 8, 2020, 12:39 PM IST

ప్రకృతి అందాల కాణాచి.. ఆల్మోరా!

ఉత్తరాఖండ్‌... కుమౌన్‌ డివిజన్‌లోని అల్మోరా సహజసిద్ధ అందాలు, చారిత్రక వైభవానికి పెట్టింది పేరు. శతాబ్దాల ఆ కళాకృతుల వారసత్వ సంపదను కాపాడుకుంటూ వస్తోందీ ప్రాంతం . నాటి నైపుణ్యం ఆనవాళ్లు ఇప్పటికీ అల్మోరా కొండ ఇళ్లల్లో దర్శనమిస్తాయి. ఆ ప్రాంతం ఒకప్పుడు కళాత్మక చెక్క శిల్పాలు, కళాఖండాలకు కేంద్రంగా వర్థిల్లింది. తగినట్లే... అల్మోరా వీధుల్లో నడుస్తూ.. పొందికగా కనిపించే ఆ ఆకృతులు చూస్తే.. విశ్వకర్మే వచ్చి స్వయంగా చెక్కారా అన్నంతగా అబ్బురపరుస్తాయి. అల్మోరా... సంస్కృతి, కళావైభవం పరంగా ఎంత ఉన్నత స్థానంలో ఉండేదో తెలియచేస్తాయి.

దేశ చారిత్రక, సాంస్కృతిక సంపదకు చిహ్నంగా నిలిచే అల్మోరా పట్టణంలో చెక్కతో తీర్చిదిద్దిన అందమైన ఆకృతులు ఎన్నో కనిపిస్తాయి. జాతిపిత మహాత్మగాంధీ, మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌నెహ్రు, స్వామివివేకానంద వంటి ప్రముఖుల జ్ఞాపకాలు తారసపడతాయి.

ఈ పట్టణం దాదాపు 3న్నర శతాబ్దాలు చాంద్ పాలకుల రాజధానిగా ఉంది. కట్యుూరి రాజులతోనూ మంచి అనుబంధం ఉంది. అక్కడి ఈ ప్రాచీనఆకృతులు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సాధించాయి. అల్మోరాలో ఝౌరీ బజార్, ఖజాంచి మొహల్లా అత్యంత పురాతనమైన వి. వందల ఏళ్లనాటి ఆ భవనాలు ఇప్పటికీ పట్టణానికి పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆ భవనాల్లోని చెక్కతో చేసిన కళాకృతులు మరికొంచెం ప్రత్యేకం. సందర్శకులను ఆహ్వానిస్తూ ఉంటాయి. రాజుల కాలం నుంచి బ్రిటీష్ హయాం వరకు.. రాజస్థానీ, దక్షిణ భారత శైలి కూడా అక్కడ కనిపిస్తాయి. అయితే వాటి ఆలనాపాలన పట్టించుకునే వారు లేక క్రమంగా ప్రాభవం కోల్పోతున్నాయి.

చాంద్ రాజవంశీయులు అల్మోరాను నిర్మించారు. అప్పట్లో కట్టిన భవంతుల్లో చెక్కతో చేసిన కళాకృతులను ప్రధానంగా ఉపయోగించేవారు. ఇళ్లల్లో రకరకాల కళాకృతులు ఉండేవి. తలుపులు, కిటికీలు ఆకర్షణీయంగా ఉండి పేరు పొందేవి.

-దివాన్ మెహ్రా, స్థానికుడు

దిల్లీ నుంచి సుమారుగా 370 కిలోమీటర్ల దూరంలో ఉంది... అల్మోరా పట్టణం. అక్కడ చాంద్‌ రాజులు అనేక కోటలు, భవనాలు నిర్మించారు. అవి ఇప్పటికీ ఉన్నాయి.

అల్మోరా లాలా బజార్‌లోని దాదాపు 80% ఇళ్లు ఇప్పుడు లేవు. ఖాజంచి మొహల్లా, మల్లి బజార్‌ వద్ద కొన్ని ఇళ్లున్నాయి. వాటిల్లో స్థానిక కళాకారులు తీర్చిదిద్దిన కళాకృతులు చూడవచ్చు. ఈ యంత్రయుగంలో అంత నైపుణ్యంతో మనం చేయలేం. అల్మోరా లోని ఇళ్లు 3 నుంచి 4 శతాబ్దాల పురాతనమైనవి.

-వి.డి.ఎస్‌. నేగి, చరిత్రకారుడు

ఈరోజుకి కూడా ఆ చెక్క ఇళ్లను చూడవచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే.. వందల ఏళ్ల క్రితం నిర్మించినా.. ఈ ఇళ్లు భూకంపాలను తట్టుకోగలవు. ఇలాంటి అరుదైన ప్రాచీన వారసత్వ సంపద పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యతే కాదు... ప్రజలంతా కలసి రావాలని పురావస్తు పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇదీ చూడండి: రైల్వేపై ప్రేమతో.. ఇంటినే రైలుగా మార్చి..

ABOUT THE AUTHOR

...view details