కరోనా విజృంభణ దృష్ట్యా సామర్థ్యం కలిగిన టీకాలను వెంటనే అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అనంతరం ప్రధానికి లేఖ రాశారు.
"దేశీయంగా టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. దాంతో పాటే అర్హత కలిగిన అన్ని వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగం కోసం త్వరితగతిన అనుమతినివ్వాలి. టీకాల లభ్యత పెరిగినప్పుడు.. వయస్సుతో సంబంధం లేకుండా అవసరం ఆధారంగా వ్యాక్సినేషన్ చేయాలి. అదే విధంగా.. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్రాలకు టీకాలను అందించాలి."