తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ల్యాండింగ్​లో అపశృతి.. రన్​వే పైనుంచి పక్కకు జరిగిన విమానం - Flight skids off runway

Flight skids off runway: ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ విమానం రన్​వే పైనుంచి పక్కకు జరిగింది. జబల్​పుర్​ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు.

alliance air flight skid off
alliance air flight skid off

By

Published : Mar 12, 2022, 5:13 PM IST

Flight skids off runway: మధ్యప్రదేశ్ జబల్​పుర్ ఎయిర్​పోర్ట్​లో అనూహ్య ఘటన జరిగింది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఓ విమానం.. పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. కిందకు దిగే క్రమంలో విమానం.. రన్​వే నుంచి పక్కకు జరిగిపోయింది.

రన్​వే నుంచి పక్కకు జరిగిన విమానం

శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఘటనలో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. దీనిపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని స్పష్టం చేశారు.

స్కిడ్ అయిన విమానం

alliance air flight skid off

ఈ విమానాన్ని ఏటీఆర్-72గా గుర్తించారు. అలయన్స్ ఎయిర్ సంస్థ దీన్ని నడిపిస్తోంది. దిల్లీ నుంచి ఉదయం 11.30 గంటలకు బయల్దేరిందని తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు స్పష్టం చేశారు.

విమానం వద్ద సహాయక చర్యలు

ఇదీ చదవండి:చిరుత మాంసంతో విందు.. చర్మాన్ని విక్రయిస్తూ అడ్డంగా..!

ABOUT THE AUTHOR

...view details