తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆదిపురుష్​' మేకర్స్​కు హైకోర్ట్ సమన్లు.. సర్టిఫికెట్​పై సమీక్ష! - అలహాబాద్​ కోర్టులో ఆదిపురుష్​ కాంట్రవర్సీ

'ఆదిపురుష్'​ టీమ్​కు అలహాబాద్​ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ సినిమా ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్న విషయాన్ని సమీక్షించాలన్న కోర్టు.. జులై 27న చిత్రబృందం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

adipurush allahabad high court
adipurush allahabad high court

By

Published : Jul 1, 2023, 8:11 AM IST

Adipurush Controversy : 'ఆదిపురుష్​' మేకర్స్​కు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. జులై 27న చిత్రబృందం​ తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం హైకోర్టు తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అందులో దర్శకుడు ఓం రౌత్​, నిర్మాత భూషణ్​ కూమార్​, డైలాగ్​ రైటర్​ మనోజ్ మంతాషిర్​ను కోర్టులో హాజరు కావాలని తెలిపింది. ఈ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్న విషయాన్ని సమీక్షించి.. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు సూచించింది. అంతే కాకుండా ఈ సినిమాకు సర్టిఫికెట్ మంజూరు చేసిన నిర్ణయాన్ని కూడా సమీక్షించాల్సిందిగా ప్రభుత్వానికి నిర్దేశించింది.

Adipurush Case News : కుల్దీప్ తివారీ, నవీన్ ధావన్‌ వేసిన వేర్వేరు పిటిషన్లను.. జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీ ప్రకాష్ సింగ్‌తో కూడిన ఓ వెకేషన్ బెంచ్​ విచారించింది. ఈ క్రమంలో సినిమా ప్రసారం కోసం సినిమా సర్టిఫికేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను పాటించారా లేదా అనే విషయానికి వివరణ ఇచ్చేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చైర్మన్‌లు తమ వ్యక్తిగత అఫిడవిట్‌లను దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణ తేదీలోగా అవసరమైన అఫిడవిట్‌లను దాఖలు చేయని పక్షంలో.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ కంటే తక్కువ స్థాయిలో లేని చెందిన ఓ క్లాస్-1 అధికారితో పాటు సీబీఎఫ్‌సీకి చెందిన ఓ అధికారి రికార్డులతో సహా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

Adipurush High Court : 'ఆదిపురుష్​' దర్శకుడు, రచయిత అలాగే నిర్మాతలు.. విచారణ తేదీలోగా వ్యక్తిగత అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అఫిడవిట్​లు వచ్చే వరకు చిత్రబృందం సభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది.

Adipurush Cast : 'ఆదిపురుష్'​ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్​-కృతిసనన్​.. రాఘవుడు-జానకిగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్​లో జూన్​ 16న విడుదలైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ​లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్​ కనిపించగా.. హనుమంతుని పాత్రలో దేవదత్త నాగే నటించారు. ఇక లంకేశుని పాత్రలో బాలీవుడ్​ హీరో సైఫ్​ అలీఖాన్​ కనిపించారు. అయితే ఈ సినిమాను ఆది నుంచే వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీజర్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలపై ఈ సినిమా నెట్టింట ట్రోల్ అవుతూనే వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details