దేశంలో కరోనా టీకాకు సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) కేంద్రానికి పలు కీలక సిఫార్సులు చేసినట్టు సమాచారం. ఆ వివరాలు తెలుసుకుందాం..
కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి పెంచారా?
కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి పెంచాలని ఎన్టీఏజీఐ సూచించింది. 12-16 వారాల వ్యవధి ఉండాలని పేర్కొంది. గతంలో ఇది 4-8 వారాలుగా ఉంది.
కొవాగ్జిన్‌కు కూడా ఇది వర్తిస్తుందా?
లేదు. కొవాగ్జిన్ టీకాల విషయంలో ఎన్టీఐజీఐ ఎలాంటి సూచనలు చేయలేదు. ప్రస్తుతం ఉన్న వ్యవధి (4-8 వారాలు) కొనసాగుతుంది.
కొవిడ్ బాధితులు టీకా ఎప్పుడు తీసుకోవాలి?
కరోనా నుంచి కోలుకున్న అనంతరం 6 నెలల తర్వాత టీకా వేసుకోవాలి. ప్రస్తుతం అది మూడు నెలలుగా ఉంది.