తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతన్న 'ట్రాక్టర్​ ర్యాలీ'కి సర్వం సిద్ధం

గణతంత్ర దినోత్సవం వేళ దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. మూడు మార్గాల్లో 2 లక్షలకుపైగా ట్రాక్టర్లలో రైతులు మంగళవారం ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

all-set-for-farmers-tractor-rally-on-tuesday
రైతన్న 'ట్రాక్టర్​ ర్యాలీ'కి సర్వం సిద్ధం

By

Published : Jan 25, 2021, 6:48 PM IST

సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో మంగళవారం రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఈ ర్యాలీలో 2లక్షలకుపైగా ట్రాక్టర్లతో రైతులు రంగంలోకి దిగుతుండగా.. ఇందుకు సంబంధించి ఇప్పటికే రోడ్​ మ్యాప్​ను సిద్ధమైంది.

ర్యాలీ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా.. శాంతియుతంగానే ర్యాలీ చేపట్టాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

భద్రతా వలయంలో దిల్లీ..

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో సాధారణంగానే భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు తోడు రైతులు ర్యాలీ చేపట్టడం వల్ల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఫలితంగా రాజ్​పథ్​ ప్రాంతం భద్రతా వలయంలోకి జారుకుంది.

రైతుల ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్​ కుట్ర పన్నిందన్న నిఘా సంస్థల హెచ్చరికతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ట్రాక్టర్​ ర్యాలీ వేళ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు.. వివిధ సరిహద్దు పాయింట్లలో వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

రోడ్​ మ్యాప్​...

ర్యాలీ కోసం మూడు మార్గాలను ఎంపిక చేశారు. మొదటిది సింఘు సరిహద్దు నుంచి ఖర్ఖోడా టోల్​ ప్లాజా వరకు 63కి.మీల మార్గం. రెండోది టిక్రి సరిహద్దు నుంచి అసోడా టోల్​ ప్లాజా వరకు 62 కిలోమీటర్ల మార్గం. ఘజియాబాద్​ నుంచి లాల్​ ఖౌన్​ వరకు సాగే 68కి.మీల మార్గం మూడోది.

ట్రాక్టర్​ ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన శకటం

గణతంత్ర వేడుకల అనంతరం.. ర్యాలీ ప్రారంభమవుతుంది. అయితే ఎక్కడ నుంచి మొదలైందో.. తిరిగి అక్కడికి చేరుకున్న తర్వాతే ట్రాక్టర్​ ర్యాలీ ముగుస్తుంది.

రైతుల ఆదేశాలు...

ర్యాలీ నిర్వహించేందుకు.. ఇప్పటికే అనేక రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో ఉంటున్న రైతు సంఘాల నేతలు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో ర్యాలీ శాంతియుతంగా సాగాలని తోటి రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎవరూ మద్యం తాగవద్దని, ఆయుధాలు తీసుకురావద్దని స్పష్టం చేశారు. 24గంటలకు సరిపడా రేషన్​ తమ వద్ద పెట్టుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:-'ట్రాక్టర్ ర్యాలీ తర్వాతే తదుపరి కార్యాచరణ'

ABOUT THE AUTHOR

...view details