తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మార్చి 1 నుంచి వారందరికీ కరోనా టీకా'

60 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా టీకా అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికీ టీకా ఇచ్చేందుకు సిద్ధమైంది.

All above 60 years of age, 45-plus with other illnesses to get COVID-19 vaccine from March 1
ఇక వృద్ధులకూ కరోనా టీకా: కేంద్రం

By

Published : Feb 24, 2021, 4:00 PM IST

Updated : Feb 24, 2021, 4:29 PM IST

దేశంలో 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొంత రుసుముతో టీకా అందించనున్నట్లు వెల్లడించింది.

భారత టీకా పంపిణీ పురోగతి, కార్యాచరణపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం చర్చించింది. 60ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా పంపిణీ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడించారు. ప్రైవేటు కేంద్రాల్లో టీకా ధరను త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:కొవిడ్​ కట్టడికి కేంద్రం ప్రత్యేక బృందాలు

Last Updated : Feb 24, 2021, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details