బంగాల్లో కొత్తగా ఎన్నికైన 77 మంది భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింస నేపథ్యంలో కేంద్ర బలగాలు, ఇతర సీనియర్ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి.
బంగాల్ భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర భద్రత! - ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాల రక్షణ
బంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన 77 మంది భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించునుందని సమాచారం.
బంగాల్ భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర భధ్రత!
సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ దళాలు ఈ 77 మంది ఎమ్యెల్యేలకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో 61 మందికి 'ఎక్స్' కేటగిరీ భద్రత లభించనుంది. మిగతా వారికి 'వై' కేటగిరీ భద్రత కల్పిస్తారు. ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి ఇప్పటికే 'జెడ్' కేటగిరీ భద్రత ఉంది. అదే ఆయనకు కొనసాగే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:బంగాల్లో మంత్రివర్గ విస్తరణ- 43మంది ప్రమాణం