Boat Accident: ఝార్ఖండ్ జామ్తాడా జిల్లా బరాకర్ నది పడవ ప్రమాదంలో గల్లంతైన 14 మంది మృతదేహాలను జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) వెలికితీసింది. ఐదు రోజుల పాటు ఈ రెస్య్కూ ఆపరేషన్ జరిపింది. మృతదేహాలను గుర్తించి, పోర్టుమార్టం చేసిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు.
ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు ఇదీ జరిగింది..
ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటలకు బరాకర్ నదిలో జామ్తాడా నుంచి నిర్సాకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. బలమైన ఈదురు గాలులు, వర్షం, తుపాను ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. పడవలో ఉన్నవారంతా కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారలేనని తెలుస్తోంది.
పడవలో ఉన్న నలుగురు ఎలాగోలా తమ ప్రాణాలు కాపాడుకోగా, 14 మంది నీటిలో మునిగిపోయారు. అప్పటి నుంచి పట్నా, రాంచీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగించాయి.
ఇదీ చూడండి:కొండచరియలు పడి జాతీయ రహదారి మూసివేత- నిలిచిపోయిన వాహనాలు