తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మద్యం ధరలు భారీగా తగ్గించాం.. ఆదా చేసిన డబ్బుతో అవి కొనండి'.. ఎమ్మెల్యే టిప్స్​! - ఆమ్​ఆద్మీ పార్టీ

మందుబాబులకు బంపర్​ ఆఫర్​ ఇచ్చింది ఓ రాష్ట్ర ప్రభుత్వం. మద్యం ధరలను ఏకంగా 60శాతం వరకు తగ్గించనుంది. అయితే అలా మిగిలిన డబ్బుతో మరింత ఎక్కువ మద్యం తాగొద్దని, ఓ పనికి ఆ సొమ్మును వాడాలని ఆ రాష్ట్ర ఎమ్మెల్యే సూచిస్తున్నారు. ఇంతకీ అదేంటి? ఏ రాష్ట్రంలో? అంటే..

liquor price drop
alcohol price drop

By

Published : Jun 12, 2022, 2:16 PM IST

మద్యం ధరలను భారీగా తగ్గించనుంది పంజాబ్​లోని ఆమ్​ఆద్మీ పార్టీ సర్కారు. ఈ మేరకు రూపొందించిన సరికొత్త ఎక్సైజ్​ విధానానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పంజాబ్​లోని మందుబాబులు ఫుల్​ ఖుషీలో ఉన్నారు. ఫరీద్​కోట్​ ఆప్​ ఎమ్మెల్యే గుర్దిత్ సింగ్​ కూడా ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే పలువురు మందుబాబులతో ముచ్చటించిన ఆయన.. లిక్కర్ విధానంపై వారి అభిప్రాయాన్ని అడిగారు. మద్యం చౌకగా లభించడం పట్ల వారు ఎంత సంతోషంగా ఉన్నది తెలుసుకున్నారు.

"ముందుగా మీరు (మందు బాబులను ఉద్దేశించి) మద్యం మానేయండి. ఒకవేళ మద్యం లేకుండా ఉండలేకపోతే తక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. ప్రభుత్వం.. మద్యాన్ని చౌకగా చేయడానికి కారణం.. అలా మిగిలిన డబ్బును ఇంటి అవసరాల కోసం వాడతారని. ఇలా ఆదా చేసిన డబ్బుతో మరింత మద్యం తాగకుండా ఇంట్లో సామగ్రి కొనుగోలు కోసం వాడండి" అని గుర్దిత్ సూచించారు.

కొత్త ఎక్సైజ్​ విధానంతో చీప్​గా లిక్కర్​:కొత్త ఎక్సైజ్​ విధానాన్ని ఇటీవలే ఆమోదించింది సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్​ ప్రభుత్వం. దీంతో పంజాబ్​లో మద్యం ధరలు 60శాతం వరకు దిగిరానున్నట్లు తెలుస్తోంది. ఇవి హరియాణా, చండీగఢ్​తో పోలిస్తే తక్కువ. చండీగఢ్​లో ఒక బీర్​ రూ.130 నుంచి రూ.150 మధ్య లభిస్తుంటే పంజాబ్​లో అదే బీర్​ రూ.120 నుంచి రూ.130 మధ్య అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పంజాబ్​లో బీర్ బాటిల్ బీర్​ ధర రూ.180 నుంచి రూ.200 మధ్య ఉంది.

ABOUT THE AUTHOR

...view details