Al qaeda Warning India:మహమ్మద్ ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా ప్రకటించింది. భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను సైతం హతమారుస్తామని 6వ తేదీతో వెలువడిన లేఖలో ఉగ్రసంస్థ పేర్కొంది.
భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తామని అల్‌ఖైదా హెచ్చరిక - Al qaeda warning india
Al qaeda: భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఉగ్రసంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను సైతం హతమారుస్తామని ప్రకటన విడుదల చేసింది.
ప్రవక్త గౌరవం కోసం పోరాడతామన్న అల్‌ఖైదా... శరీరాలకు పేలుడు పదార్థాలను బిగించిన ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించుతామంది. తమ పిల్లలను సైతం ఇందుకు వినియోగిస్తామని పేర్కొంది. భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు తీవ్ర నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అల్‌ఖైదా ఈ హెచ్చరిక చేసింది. అయితే కొందరు వ్యక్తుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించడం, తగదని భారత దౌత్యాధికారులు ఇప్పటికే ఆయా దేశాలకు స్పష్టం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై భారతీయ జనతా పార్టీ చర్చలు తీసుకుంటుందని వివరించారు.
ఇదీ చదవండి:నుపుర్ శర్మకు 'మహా' పోలీసుల సమన్లు- దిల్లీ పోలీసుల భద్రత