రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ్(జనరల్ సెక్రటరీ)గా ఎంపికయ్యారు దత్తాత్రేయ హోసబలే. బెంగుళూరు వేదికగా జరుగుతోన్న అఖిల భారతీయ ప్రతినిధి సభలో హోసబలేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకన్నట్లు ఆర్ఎస్ఎస్ తమ ట్విటర్ ఖాతాలో పేర్కొంది. 2009 నుంచి ఈయన సంఘ్ సహ సర్ కార్యవాహ్గా ఉన్నట్లు పేర్కొంది.
ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీగా 'హోసబలే' - ఏబీపీఎస్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ్గా దత్తాత్రేయ హోసబలే ఎంపికయ్యారు. శనివారం బెంగుళూరు వేదికగా అఖిల భారతీయ ప్రతినిధి సభలో పాల్గొన్న కార్యకర్తలు ఈయనను ఎన్నుకున్నారు.
ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీగా దత్తాత్రేయ
శివమొగ్గకు చెందిన హోసబలే గత జనరల్ సెక్రటరీ సురేష్ భయ్యాజీ జోషీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. 1968లో ఈయన సంఘ్లో చేరారు. కన్నడ మ్యాగజైన్ అసీమాకు ఎడిటర్గాను పనిచేశారు. 1975-1977 ఎమర్జెన్సీ సమయంలో 16 నెలల పాటు హోసబలే జైలు జీవితం గడిపారు.
ఇదీ చదవండి:కాబోయే సైనికులు.. ఫుట్పాత్లే పాన్పులు
Last Updated : Mar 20, 2021, 1:53 PM IST