అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి.. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని బంగాబరి మఠంలో అనుమానాస్పద స్థితిలో మృతి(Mahant Narendra Giri Death News) చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం, ప్రత్యేక పోలీసు బృందం.. మహంత్ మృతిపై(Mahant Narendra Giri Death News) దర్యాప్తు చేపట్టింది.
మహంత్ తన గదిలో ఉరి వేసుకుని(Mahant Suicide News) మృతి చెందినట్లుగా కనిపించారని అహ్మదాబాద్ ఎస్పీ దినేశ్ కుమార్ తెలిపారు. అయితే.. దీని గురించి ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. మఠంలోపలికి ఎవరూ వెళ్లేందుకు అధికారులు అనుమతించటం లేదు.
సూసైడ్ నోట్ రాసి..
మహంత్ నివాసంలో పోలీసులు.. 6-7 పేజీలతో ఉన్న ఆత్మహత్య(Mahant Suicide News) లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆయన శిష్యుడు ఆనంద్ గిరి పేరును ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు.
"ఎంతో గౌరవంతో నేను జీవించాను. అవమానం జరిగాక నేనిక బతకలేను. నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను" అని లేఖలో మహంత్ నరేంద్ర గిరి పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.
అది ఆత్మహత్య కాదు..
ఇతరులను ఎంతో ప్రోత్సహించే నరేంద్ర గిరి(Mahant Narendra Giri Death News) వంటి వ్యక్తి ఆత్మహత్య ఎలా చేసుకుంటారని మహంత్ శిష్యులు ప్రశ్నిస్తున్నారు. ఆయన మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు మహంత్ ఆత్మహత్య లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఉన్నది నరేంద్ర గిరి చేతిరాతేనా? లేదా ఇంకెవరిదైనా అయ్యుంటుందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నరేంద్ర గిరి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.