తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియా రమణికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టుకు ఎంజే అక్బర్​

మహిళా పాత్రికేయురాలు ప్రియా రమణిని నిర్దోషిగా ప్రకటిస్తూ.. ట్రయల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేశారు కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్​. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో పిటిషన్​ వేశారు. గురువారం దీనిపై విచారణ జరగనుంది.

Akbar moves Delhi HC against Ramani
ప్రియా రమణిపై దిల్లీ హైకోర్టుకు ఎంజే అక్బర్​

By

Published : Mar 25, 2021, 6:22 AM IST

కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్​.. ప్రియా రమణికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టుకు వెళ్లారు. మీటూ కేసులో ఆమెపై అక్బర్​ వేసిన పరువు నష్టం వ్యాజ్యాన్ని దిల్లీ ట్రయల్​ కోర్టు కొట్టేసింది. దీనిని సవాల్​ చేస్తూ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం రోజు దీనిపై విచారణ జరగనుంది.

జస్టిస్​ ముక్తా గుప్తా ఈ వ్యాజ్యాన్ని పరిశీలించనున్నారు.

ఒకరి పరువు హక్కు కోసం.. ఒక మహిళ జీవించే హక్కును, గౌరవాన్ని ఫణంగా పెట్టలేమని ఫిబ్రవరి 17న తీర్పులో భాగంగా ట్రయల్​ కోర్టు వ్యాఖ్యానించింది. ఆ సందర్భంగా.. మహాభారత, రామాయణాలను కూడా ప్రస్తావించింది.

ఇదీ కేసు..

1993లో ఓ హోటల్‌ గదిలో అక్బర్‌ తనను లైంగికంగా వేధించారని, 'మీటూ' ఉద్యమంగా జోరుగా సాగుతున్న 2018లో ప్రియా రమణి ఆరోపించారు. అప్పటికి కేంద్ర మంత్రిమండలిలో అక్బర్‌ మంత్రిగా ఉన్నారు. రమణి వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించాయని దావా వేశారు.

ఆ తర్వాత చాలా మంది మహిళలు రమణి.. తరహాలోనే లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అక్బర్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: దేశానికే పరువు నష్టం!

ABOUT THE AUTHOR

...view details