Nupur sharma controversy: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ తల నరికినవాళ్లకు తన ఇంటిని బహుమతిగా ఇస్తానన్న అజమేర్ దర్గా మత గురువును రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. దర్గా ఖాదిమ్ సల్మాన్ చిశ్తీ ఈ మేరకు వీడియోలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అతడికి ఇదివరకే నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.
"మంగళవారం రాత్రి అతడిని పట్టుకున్నాం. ఖాదిమ్ మొహల్లాలోని అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నాం. జూన్ 28(ఉదయ్‌పుర్ హత్య జరిగిన తేదీ)కు ముందే వీడియో తీసినట్టు నిందితుడు చెప్పాడు. ఆ తర్వాత వీడియో లీక్ అయిందని తెలిపాడు. మద్యం మత్తులో ఈ వ్యాఖ్యలు చేసి వీడియో తీశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాం."
-పోలీసులు